హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ మొదలైంది. తొలి రోజు రాత్రి 10 గంటల వరకు16 వేల మంది అప్లై చేశారు. టెట్ వెబ్ సైట్లో పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్సిలబస్ వివరాలను పెట్టారు. అయితే, గతంలో పెట్టిందే ఈసారి కూడా పెట్టారని అభ్యర్థులు చెప్పారు. సిలబస్ ఇప్పటికి మూడు, నాలుగు సార్లు మారినా ఇంకా 2015 పాఠ్య పుస్తకాల ఆధారంగా అంటూ పేర్కొనడంపై అభ్యర్థులు క్లారిటీ కోరుతున్నారు.

