బేసిక్‌‌ పే రూ.41,960.. ఎస్​బీఐలో జాబ్స్

బేసిక్‌‌ పే రూ.41,960.. ఎస్​బీఐలో జాబ్స్

స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. మొత్తం 1673 పీవో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: మొత్తం 1673 పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్- 1600, బ్యాక్‌‌లాగ్- 73 ఖాళీలు ఉన్నాయి. 
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు బేసిక్‌‌ పే రూ.41,960 చెల్లిస్తారు.
సెలెక్షన్​: ఫేజ్‌‌1-ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్‌‌ 2- మెయిన్‌‌ ఎగ్జామినేషన్, ఫేజ్‌‌ 3 -సైకోమెట్రిక్‌‌ టెస్ట్, గ్రూప్‌‌ ఎక్సర్‌‌సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌‌లైన్‌‌లో సెప్టెంబర్​ 22 నుంచి అక్టోబర్​ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ ఆన్‌‌లైన్‌‌ పరీక్ష 17, 18, 19, 20 డిసెంబర్‌‌లో నిర్వహిస్తారు. మెయిన్స్​ 2023వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఫేజ్‌‌-3 సైకోమెట్రిక్‌‌ టెస్టులు, ఇంటర్వ్యూలు ఫిబ్రవరి/మార్చిలో ఉంటాయి.

పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్​సైట్ సంప్రదించాలి.