ముంబైలో ఒక సైకో పోలీసులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 20 మంది చిన్నారులను ఎత్తుకెళ్లి టెన్షన్ పెట్టాడు. ఎట్టకేలకు పోలీసులు సైకోను పట్టుకుని పిల్లలను కాపాడారు. గురువారం (అక్టోబర్ 30) జరిగిన ఈ ఇన్సిడెంట్ లో.. సైకో డిమాండ్స్ చూసి పోలీసులు షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ ఆర్య అనే వ్యక్తి వీధుల్లో ఇంటి ముందు ఆడుకుంటున్న వాళ్లని, స్కూల్ కు వెళ్తున్న వాళ్లని.. ఇలా మొత్తం 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేశాడు. పిల్లలు కనిపించడం లేదని పేరెంట్స్ ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. సైకోను ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు పొవై ఏరియాలో సైకో నుంచి కాపాడారు.
చిన్నారులను కాపాడే క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో రోహిత్య ఆర్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఎయిర్ గన్ తో దాడి చేసేందుకు ప్రయత్నించాడని.. ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
నేను టెర్రరిస్టును కాదు.. ఆ తప్పు చేయకండి..
అంతకు ముందు ఈ ఘటనకు సంబంధించి కాసేపు డ్రామా నడిచింది. ఈ ఘటనకు సంబంధించి రోహిత్ ఆర్య వీడియో రిలీజ్ చేశాడు. తను కొందరితో మాట్లాడాలని.. ఆ వకాశం కల్పించకుంటే పిల్లలను చంపేసి.. తను కూడా చనిపోతానని బెదిరించాడు. మెంటల్ కండిషన్ బాగాలేని వ్యక్తి అని.. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నేను టెర్రరిస్టును కాదు.. నన్ను షూట్ చేసి తప్పు చేయకండి.. నేను పిల్లలను బంధిస్తున్నాను.. సూసైడ్ చేసుకునే బదులు కొందరితో మాట్లాడాలి.. నావి సింపు డిమాండ్స్.. న్యాయమైన డిమాండ్స్.. కొన్ని ప్రశ్నలు.. అంటూ వీడియో ద్వారా హెచ్చరించాడు.
పొవై లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న RA స్టూడియో కు వచ్చిన పిల్లలుగా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి ఎయిర్ గన్ లాంటి వస్తువు, కొన్ని కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
