పాక్‎లో 17 మంది మిలిటెంట్ల హతం

పాక్‎లో 17 మంది మిలిటెంట్ల హతం

పెషావర్: నిషేధిత తెహ్రీక్– ఇ– తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో సంబంధం ఉన్న 17 మంది మిలిటెంట్లను పాకిస్తాన్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎లోని కరాక్ జిల్లాలో ఫ్రాంటియర్ కోర్, పోలీసులు సంయుక్తంగా నిఘా ఆపరేషన్ చేపట్టాయి. టీటీపీ, ముల్లా నజీర్ గ్రూపుతో సంబంధం ఉన్న మిలిటెంట్ల ఉనికికి సంబంధించి సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాయి. 

భద్రతా బలగాల రాకను గమనించి టెర్రరిస్టులు కాల్పులు జరపగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో17మంది ఉగ్రవాదులు చనిపోయారని అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.