పెళ్లి వేడుకలో కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత

పెళ్లి వేడుకలో కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత

ఓ పెళ్లి వేడుకలో కలుషిత ఆహారం తిన్న 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో భాగంగా ఆహారం తీసుకున్న కొద్ది సేపటికే.. తిన్న17 మంది అస్వస్థతకు గురై, ఆస్పత్రి పాలయ్యారు. బాధితులను మండపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  అయితే వివాహ వేడుకలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌కు సరైన కారణాలేమీ ఇంకా తెలిసి రాలేదు.

ఇటీవలి కాలంలో చాలా ప్రాంతాలలో ఫుడ్ పాయిజనింగ్ అనేది సాధారణమైన విషయంగా మారిపోయింది. ప్రభుత్వ కాలేజీల్లో, హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురై.. ఆస్పత్రుల పాలవడం చూస్తూనే ఉన్నాం. కారణాలేమైనా గానీ పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగానే ఉంటున్నాయి.