
జాగ్రెబ్: ఇండియా యంగ్ రెజ్లర్ అమన్ షెరావత్.. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ 57 కేజీల బౌట్‌లో 17 ఏళ్ల అమన్ 10–4తో జానే రె రోడ్స్ రిచర్డ్స్ (అమెరికా)పై గెలిచాడు. టైటిల్ ఫైట్‌లో అజర్‌బైజాన్ రెజ్లర్ అలిబ్బాస్ రజాడే 2–0తో యుటో నిషుచి (జపాన్)పై నెగ్గి గోల్డ్ మెడల్‌ను సాధించాడు.
అంతకుముందు జరిగిన క్వార్టర్స్ బౌట్స్‌లో అమన్.. రొబెర్టి డింగాషివిల్ (జార్జియా)పై గెలవగా, సెమీస్‌లో నిషుచి చేతిలో ఓడాడు. అయితే నిషుచి ఫైనల్‌కు చేరడంతో అమన్‌కు రెప్‌చేజ్ రౌండ్ ఆడే చాన్స్ దక్కింది. ఇక విమెన్స్ 50 కేజీల క్వార్టర్‌ఫైనల్లో శివాని పవార్ 0–4తో ఎరిన్ సిమోన్ గోల్‌స్టోన్ (అమెరికా) చేతిలో ఓడింది. మెన్స్ 92 కేజీ బౌట్‌లో పృథ్వీ రాజ్ బాబాసాహెబ్ పాటిల్ రెప్‌చేజ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో పృథ్వీ 0–10తో మిరాని మైసురాద్జే (జార్జియా) చేతిలో ఓడాడు.