
ఆన్ లైన్ గేమ్స్ యువకుల జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో తెలిపే ఉదంతం ఇది. 17ఏళ్ల బాలుడు ఓ డాక్టర్ నుంచి సుమారు రూ.7.5లక్షలు దొంగిలించి ఖరీదైన ఫోన్, గేమ్ లలో పెద్దమొత్తంలో డబ్బుల్ని ఖర్చు పెట్టి చివరకు కటకటాల పాలయ్యాడు.
చెన్నై అన్నా నగర్ కు చెందిన 76 ఏళ్ల డాక్టర్ కు ఇద్దరు కుమారులు. విదేశాల్లో స్థిరపడ్డారు. ఆయనను చూసుకునేందుకు డాక్టర్ ఇంటిపైన పెంట్ హౌస్ లో గత ఏడేళ్లు ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే 17ఏళ్ల బాలుడు బాధితుడికి అన్నింట్లో సాయం చేసేవాడు. కుటుంబసభ్యుడిగా మెలిగేవాడు.
అయితే ఆ బాలుడికి ఖరీదైన్ మొబైల్ తో ఆన్ లైన్ లో గేమ్ లు ఆడాలనే కోరిక పుట్టింది. స్కూల్ కు వెళ్లే విద్యార్దికి అంత పెద్దమొత్తంలో డబ్బులు కావాలంటే సాధ్యపడదు. అందుకే ఆ బాలుడు తన యజమాని వద్ద నుంచి డబ్బుల్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు.
ఓ సారి బాధితుడికి సదరు బాలుడు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడంలో సాయం చేశాడు. ఆసందర్భంగా డెబిట్ కార్డ్ వివరాల్ని దొంగలించాడు. దొంగిలించిన డబ్బుతో 30వేలతో ఫోన్ కొన్నాడు. ఇలా పలుమార్లు రూ.7.5లక్షలు డబ్బుల్ని బాధితుడికి తెలియకుండా డెబిట్ కార్డ్ ను స్వైప్ చేశాడు. ఫోన్ లో బాధితుడికి తెలియకుండా ఓటీపీ తీసుకొని వాటిని డిలీట్ చేసేవాడు.
ఈ నేపథ్యంలో బాధితుడు తన అకౌంట్ లో రూ.7.5లక్షలు మాయమైనట్లు గుర్తించి అన్నా నగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో డాక్టర్ కు సాయం చేసే బాలుడే డబ్బుల్ని కాజేశాడని, ఆ డబ్బులతో ప్రీమియం ఆన్ లైన్ గేమ్స్ ఆడినట్లు తేలింది. అయితే తన కొడుకు దొంగిలించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని బాలుడి తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో డాక్టర్ కేసును ఉపసహరించుకున్నాడు. పోలీసులు మైనర్ బాలుడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.