
హైదరాబాద్ ప్రశాంత్ నగర్ లో దారుణం జరిగింది. మైనర్ బాలిక ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ బంధువులు మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనిత అనే 17 ఏళ్ల బాలికను సవతి తల్లి సోదరుడు మల్లేష్ లోబరుచుకుని గర్భవతి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం బయటకు రాకుండా లక్షా 50 వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ప్రెగ్నెంట్ కావడంతో మనస్తాపం చెంది ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు.
సవతి తల్లే కొట్టి బాలికను చంపి..సూసైడ్ గా చిత్రీకరిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం… సవతి తల్లి సోదరుడు, నిందితుడుగా భావిస్తున్న మల్లేష్ పరారీలో ఉన్నాడు. మల్లేష్ దొరికితే అసలు నిజాలు తెలుస్తాయంటున్న పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు.