భరత నాట్యంలో రికార్డులన్నీ బ్రేక్ చేసిన ఇండియన్ స్టూడెంట్.. వారం రోజుల పాటు నాన్ స్టాప్ డ్యాన్స్.

భరత నాట్యంలో రికార్డులన్నీ బ్రేక్ చేసిన  ఇండియన్ స్టూడెంట్.. వారం రోజుల పాటు నాన్ స్టాప్ డ్యాన్స్.

డ్యాన్స్ ఎవరైనా ఎంత సేపు చేస్తారు.. ఒక పది నిమిషాలు.. లేదా అరగంట.. లేదంటే లాస్ట్ గంట రెండు గంటలు. కానీ ఈ అమ్మాయి నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించింది. స్టేజ్ పైన ఎలాంటి అలుపూ సొలుపూ లేకేండా కంటిన్యూగా భరతనాట్యం చేస్తూ వరల్డ్ రికార్డును తిరగరాసింది. 170 గంటలు డ్యాన్స్ చేస్తూ.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి ఈ ఇండియన్ స్టూడెంట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

కర్ణాటక మంగళూరు లోని సెయింట్ అలొయ్ సియన్ కాలేజ్ కు చెందిన రెమోనా ఎవరెట్ పెరీరా అనే స్టూడెంట్ ఈ ఫీట్ సాధించింది. ఎనిమిది రోజులుగా కంటిన్యూగా భరతనాట్యం చేస్తూ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈమె డ్యాన్స్ వీడియో వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో సూపర్బ్ అప్లాస్ వస్తోంది. 

ప్రతీ గంటలు 5 నిమినిషాల రెస్ట్:

భరతనాట్యంపై ఉన్న తన ప్యాషన్ ను వరల్డ్ రికార్డుతో మరో లెవల్ కు తీసుకెళ్లింది పెరీరా. ఎనిమిది రోజులు నిర్విరామంగా డ్యాన్స్ చేసిన ఈమె.. ప్రతీ గంటకు కేవలం 5 నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకుంది. జులై 21న వినాయక స్తోత్రంతో ప్రారంభించి.. జులై 28 మధ్యాహ్నం వరకు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చూడటానికి కూర్చున్న వాళ్లే అలసిపోయారు కానీ ఆమె అలసిపోలేదు. ఎనిమిది రోజులు ముగిసే వరకు నిద్ర పోలేదు. 

ఎనిమిది రోజులు ఎక్కడా ఆగకుండా డ్యా్న్స్ చేస్తున్నప్పటికీ ఆమె ఎక్కడా అలసట చెందినట్లు కనపడలేదని ప్రత్యక్షంగా చూసినవాళ్లు చెబుతున్నారు. అలసట చెందినట్లు గానీ.. దాని వలన అభినయంలో, ఎక్స్ ప్రెషన్ లో ఎలాంటి మార్పు రాలేదని.. డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా మొదలు పెట్టిందో.. ముగించే వరకు అలాగే.. అంతే ఎనర్జీతో ఉండటం విశేషం. ఆమెకు గంటకు 5 నిమిషాలు.. అలాగే ప్రతి మూడు గంటలకు 15 నిమిషాల రెస్ట్ మాత్రమే ఇచ్చారు నిర్వాహకులు. పెరీరా అద్భుత భరతనాట్య ప్రదర్శనతో దేశానికే మంచి పేరు తెచ్చిందని ఆమె కోచ్ శ్రీవిధ్య మురళీధర్ తెలిపారు. 

ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ డా.ప్రవీణ్ మార్టిస్ మాట్లాడుతూ.. భరత నాట్యంలో ప్రపంచ రికార్డు సృష్టించాలనేది ఆమె ఎన్నో ఏళ్ కల అని.. ఆమె డ్రీమ్స్ నెరవేరాయని అన్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఆమె ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఆమెకోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. అంతిమంగా ప్రపంచ రికార్డు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చిందని కొనియాడారు. 

ఐదు రోజులు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేస్తే వరల్డ్ రికార్డు అవుతుందని తాము చెప్పినప్పటికీ.. ఆమె ఏడు రోజులు డ్యాన్స్ చేసి మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిందని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి డా.మనీష్ విష్ణోయ్ తెలిపారు. 10 వేల 200 నిమిషాలు ఆగకుండా డ్యాన్స్ చేసి ఆమె ప్రపంచ రికార్డు నమోదు చేసిందని ప్రకటించారు.