
కన్నూర్: స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో బాధపడుతున్న బాబును ఆదుకునేందుకు చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. బాబుకు వేసే అత్యంత ఖరీదైన ‘జాల్ గెన్జ్ మా’ ఇంజెక్షన్‌కు తలా కొంత సాయం చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా వారం రోజుల్లోనే ఏకంగా రూ.18 కోట్లు సమకూరడం విశేషం. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లాలోని మత్తుల్లో ఉంటున్న రఫీక్, మరియమ్మలకు నెల రోజుల వయసున్న బాబు ఉన్నాడు. ఈ బాబు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బాబును కాపాడాలంటే ‘జాల్ గెన్జ్ మా’ అనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది. బాబు పేరెంట్స్ సాయం కోసం ప్రయత్నించగా.. ఎమ్మెల్యే విజిన్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్కమిటీ వేశారు. క్రౌడ్ ఫౌండింగ్ ద్వారా డొనేషన్స్‌కు ప్రత్యేక అకౌంట్ తీసి సాయంచేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో వారం రోజుల్లోనే రూ.18 కోట్లు జమ అయ్యాయి. బాబు ట్రీట్మెంట్కు సరిపోను డబ్బులు వచ్చాయి. దీంతో డొనేషన్స్ ఇవ్వొద్దని డాక్టర్ల టీమ్ విజ్ఞప్తి చేసింది.