ఐబీపీఎస్​లో 1828 స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​

ఐబీపీఎస్​లో 1828 స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​

ఐబీపీఎస్ 1828 స్పెషలిస్ట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఇప్పటికే బ్యాంక్​ క్లర్క్​, పీఓ జాబ్స్​కు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. బ్యాంకింగ్‌ రంగంలో  డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో ఆఫీసర్‌​ కేడర్​ పోస్టులు ఎలా సొంతం చేసుకోవాలి, ఎగ్జామ్​ ప్యాటర్న్​, సెలెక్షన్​ ప్రాసెస్​, ప్రిపరేషన్‌ టిప్స్‌ ఈ వారం తెలుసుకుందాం.. 

మార్కెట్​లో పెరుగుతున్న పోటీ దృష్టిలో పెట్టుకొని, లేటెస్ట్​ టెక్నాలజీతో వినియోగదారులకు మెరుగైన బ్యాంకింగ్​ సేవలు అందించడానికి వివిధ విభాగాల్లో డిగ్రీ, పీజీ చేసిన వారిని స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​గా రిక్రూట్​ చేసుకుంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: ఐబీపీఎస్​ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1828 ఖాళీలున్నాయి. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్‌‌- 220 పోస్టులు, ఐటీ ఆఫీసర్‌‌- 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌‌- 884 పోస్టులు, రాజభాష అధికారి- 84 పోస్టులు, లా ఆఫీసర్‌‌- 44 పోస్టులు, హెచ్‌‌ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్‌‌- 61 పోస్టులు, మార్కెటింగ్ ఆఫీసర్‌‌ 535 పోస్టులున్నాయి.

అర్హతలు: ఐటీ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల ఇంజినీరింగ్​ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అగ్రికల్చర్‌​ ఫీల్డ్​ ఆఫీసర్​​కి సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉండాలి. రాజ్యభాష అధికారికి హిందీ, సంస్కృతం భాషల్లో పీజీతో పాటు ఇంగ్లిష్​/ హిందీ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లా ఆఫీసర్​ పోస్టుకు లా డిగ్రీతో పాటు బార్​ కౌన్సిల్​లో అడ్వకేట్​గా ఎన్​రోలై ఉండాలి. మార్కెటింగ్​ ఆఫీసర్​కి మార్కెటింగ్​ స్పెషలైజేషన్​లో రెండేళ్ల  పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్‌‌, మెయిన్స్‌‌, ఇంటర్వ్యూ మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌‌ ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌‌లైన్‌‌లో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులున్నాయి. ప్రతి రాంగ్​ ఆన్సర్‌‌‌‌కు 1/4 మార్కు మైనస్ అవుతుంది. డ్యురేషన్120 నిమిషాలు. ప్రిలిమ్స్‌‌ క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఈ మార్కులను మెరిట్‌‌లో కలపరు. ప్రిలిమ్స్‌‌లో క్వాలిఫై అయిన వారిని ఖాళీలను బట్టి మెయిన్స్‌‌కు షార్ట్‌‌లిస్ట్ చేస్తారు. ప్రతి సెక్షన్‌‌తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు సాధించాలి. మెయిన్స్‌‌లో రాజ్యభాష అధికారి తప్ప మిగతా పోస్టులకు ప్రొఫెషనల్‌‌ నాలెడ్జ్‌‌ టెస్ట్‌‌ మాత్రమే ఉంటుంది. ఇందులో 60 మార్కులకు 60 ప్రశ్నలిస్తారు. సమయం 45 నిమిషాలు. రాజ్యభాష అధికారికి ప్రొఫెషనల్​ నాలెడ్జ్‌‌ 45 మార్కులకు, డిస్ర్కిప్టివ్ టెస్ట్ 15 మార్కులకు ఉంటుంది. మెయిన్స్‌‌లో  కటాఫ్ మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 100 మార్కులు కేటాయించారు. మెయిన్స్​, ఇంటర్వ్యూల్లో మెరిట్‌ ఆధారంగా ఫైనల్‌ సెలెక్షన్‌ ఉంటుంది.  

ఉద్యోగాలు కల్పించే బ్యాంక్స్​: బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా, బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా, బ్యాంక్‌‌ ఆఫ్‌‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌‌, సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా, ఇండియన్‌‌ బ్యాంక్‌‌, ఇండియన్‌‌ ఓవర్సీస్‌‌ బ్యాంక్‌‌, పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌, పంజాబ్‌‌ అండ్‌‌ సింధ్‌‌ బ్యాంక్‌‌, యూనియన్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా.

సిలబస్ అండ్ టిప్స్‌‌
అగ్రికల్చర్​ ఆఫీసర్​: స్పెషలిస్ట్ ఆఫీసర్లు అగ్రికల్చర్ లోన్లు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి పథకాలు, ఇన్సూరెన్స్​ స్కీమ్స్​, క్రాప్​ సీజన్స్​, అగ్రికల్చర్​ స్కీమ్స్, మార్కెటింగ్ తదితర కార్యకలాపాల్లో రైతులకు సహకరించాలి. కాబట్టి బ్యాంకులో ఈ విధులకు సంబంధించిన ప్రశ్నలతో పాటు అకడమిక్ టాపిక్స్‌‌ అయిన సీడ్స్​, ఏనిమల్​ హజ్బెండరీ, క్రాప్​ అండ్​ సీడ్​ వెరైటీస్​, పెస్టిసైడ్స్​, ప్లాంట్స్, ఫ్రూట్స్​, వెజిటబుల్స్​లో ముఖ్యాంశాలు, క్రాప్ సిస్టమ్స్​, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్​ ఎకనామిక్స్​, అగ్రికల్చర్​ ప్రాక్టీసెస్​, సాయిల్​ టైప్స్, గ్రీన్​ మ్యాన్యూర్స్​, అగ్రికల్చర్​ ఇండస్ర్టీస్​, ఏనిమల్​ డిసీజెస్​ అండ్​ ఇట్స్​ కాజెస్​ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నిత్యం ఇండస్ర్టీ అప్‌‌డేట్స్ తెలుసుకుంటూ ప్రిపేరయితే మంచిది.

మార్కెటింగ్ ఫీల్డ్​ ఆఫీసర్​: బ్యాంక్​ సర్వీస్​లను వినియోగదారులకు చేరవేసే మార్కెటింగ్​ విధానాలు, కస్టమర్లను ఆకట్టుకునే పథకాలు, బ్యాంక్​లో లభిస్తున్న సర్వీసులు–ఉపయోగాలు ప్రిపేర్‌ అవ్వాలి. రూరల్​ ఏరియాల్లో  మార్కెటింగ్ స్ర్టాటజీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాంకింగ్​ ఇండస్ర్టీలో వస్తున్న మార్పులు, మార్కెటింగ్​ ఎన్విరాన్​మెంట్, కన్స్యూమర్​ బిహేవియర్​, బి‌‌‌‌2బి మార్కెటింగ్​, సర్వీస్​ మార్కెటింగ్​, ఇంటర్నేషనల్​ బిజినెస్​, బ్రాండింగ్, మార్కెటింగ్​ చానల్స్​, అడ్వర్​టైజింగ్ అండ్​ పబ్లిక్​ రిలేషన్స్​, 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్​, సేల్స్ ప్రమోషన్, సోషల్​ మీడియా మార్కెటింగ్, పర్సనల్​ సెల్లింగ్​ వంటి టాపిక్‌‌ల నుంచి ప్రొఫెషనల్​ నాలెడ్జ్​ను పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. 

లా ఆఫీసర్​: బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్​ ఇన్​స్ర్టుమెంట్స్​ యాక్ట్స్​, అగ్రికల్చర్​ చట్టాలతో పాటు వినియోగదారుల చట్టాలు, ఇన్సూరెన్స్ చట్టాలు, పోరమ్స్​, కంపెనీ యాక్ట్​, బ్యాంకింగ్ అంబుడ్స్​మన్​, మనీలాండరింగ్​ యాక్ట్​, ఐటీ చట్టం 2000, ఫారెన్​ ఎక్స్​చేంజ్​ యాక్ట్, కాంట్రాక్ట్​ ఆఫ్​ గ్యారంటీ, టైప్స్​ అఫ్ కంపెనీస్​, పార్ట్‌‌నర్​షిప్​ యాక్ట్​ వంటి లా రిలేటెడ్​ అంశాలను క్షుణ్ణంగా ప్రిపేర్‌ అవ్వాలి. 

నోటిఫికేషన్
వయసు: 23 నవంబర్​ 2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
చివరితేది: 23 నవంబర్‌‌ 
అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌‌కు రూ. 175.
ప్రిలిమ్స్​ ఎగ్జామ్​: 26 డిసెంబర్​ 2021.
మెయిన్స్: 30 జనవరి 2022.
ఇంట‌‌ర్వ్యూలు: ఫిబ్రవ‌‌రి/మార్చి 2022లో నిర్వహిస్తారు
వెబ్‌‌సైట్: www.ibps.in

ఎగ్జామ్ ప్యాటర్న్‌‌
ప్రిలిమ్స్‌‌
సబ్జెక్ట్‌                 ప్రశ్నలు    మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్    50            25 
రీజనింగ్                50           50
ఐటీ, అగ్రికల్చర్, హెచ్‌‌ఆర్, మార్కెటింగ్
క్వాంటిటేటివ్​  ఆప్టిట్యూడ్​    50    50
లా ఆఫీసర్, రాజ్యభాష  అధికారి
జనరల్ అవేర్‌‌నెస్    50     50
మొత్తం    150    125

    - వెలుగు, ఎడ్యుకేషన్  డెస్క్‌