గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు మొత్తం 5 కేసుల్లో 19 మంది సైబర్ నేరస్తులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ ఫ్రాడ్ కేసుల్లో 9 మంది, డిజిటల్ అరెస్ట్ కేసులో ఒకరు, సైబర్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
