67 ఏళ్ల వయస్సులో 25 ఏళ్ల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత.. 2 వారాల్లో అనుమానాస్పద మృతి

67 ఏళ్ల వయస్సులో 25 ఏళ్ల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత.. 2 వారాల్లో అనుమానాస్పద మృతి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరానికి చెందిన 67 ఏళ్ల మాజీ కౌన్సిలర్, బీజేపీ నుంచి బహిష్కరించబడిన నయీమ్ ఖాన్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇతను 25 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్న కొద్ది వారాలకే చనిపోవడంతో.. అతని కుటుంబంలో, రాజకీయ వర్గాల్లో చాలా అనుమానాలు రేకేస్తిస్తున్నాయి.

వివరాల ప్రకారం కొంతకాలం క్రితం రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వార్తల్లోకెక్కిన నయీమ్  ఖాన్, హఠాత్తుగా ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి చేరగా... అక్కడ చేరిన కొద్దిసేపటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దింతో  పోలీసులు అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించి.. కేసును లోతుగా విచారిస్తున్నారు. 

అయితే నయీమ్  ఖాన్ చనిపోవడానికి ముందు అతని జీవితం చాలా ఆందోళనగా మారింది. రెండు నెలల క్రితం ఓ యువతి అతని పై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో, అతన్ని బీజేపీ పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు బహిష్కరించారు. ఆ వెంటనే రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే, కొత్తగా పెళ్లయిన భార్య కూడా అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో FIR నమోదైంది. ఈ గొడవలన్నిటి కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని స్నేహితులు చెబుతున్నారు.

నయీమ్  ఖాన్ చనిపోయిన తర్వాత, అతని కోడలు శిఖా ఖాన్ సెప్టెంబర్‌లో అతని పెళ్లి అయినప్పటి నుంచి అతను  చాలా ఇబ్బంది పడుతున్నాడని తెలిపింది. ఆమె చెప్పినదాని ప్రకారం, నయీమ్ ఖాన్ అతని కొత్త భార్య మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనివల్ల అతనికి ఆందోళన మరింత పెరిగింది.

శుక్రవారం ఉదయం నయీమ్ ఖాన్ మాట్లాడటం లేదని తనకు ఫోన్ వచ్చిందని, తాను ఇంటికి వెళ్లేసరికి అతను చనిపోయి ఉన్నాడని శిఖా ఖాన్  చెప్పారు. దింతో కుటుంబ సభ్యులు ఈ కేసుపై పూర్తిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

నయీమ్ ఖాన్ తన మొదటి భార్య కుటుంబం నుంచి విడిగా ఉంటూ, తన రెండో భార్యతో కలిసి శనిచారి ప్రాంతంలో ఓ  ఇంట్లో ఉంటున్నారు. అతని మరణానికి ముందు జరిగిన గొడవలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.