కార్తి హీరోగా నలన్ కుమారస్వామి తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వా వాతియార్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. కృతిశెట్టి హీరోయిన్. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం (డిసెంబర్ 6న) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 2:19 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ కామెడీ యాంగిల్లో ఆసక్తిరేపుతోంది. కార్తి ఇన్నోసెంట్ ఎక్సప్రెషన్స్తో ఇచ్చే డైలాగ్స్, ఇతర నటీనటులతో చేసే కామెడీ ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కార్తి దివంగత నటుడు మరియు ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ అభిమాని అని, తన తండ్రి రాజ్‌కిరణ్ పోషించిన పాత్రను థియేటర్లలో జరుపుకోవడం విజువల్స్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది.
అయితే, నటనలో ఉన్న కొడుకు చివరికి పోలీసు అధికారిగా మారడం, ఆ తర్వాత, నేర విషయాలను ఎదుర్కోవడం.. వంటి సీన్స్తో ట్రైలర్ క్రేజీగా సాగింది. ఇక ఓవరాల్గా ట్రైలర్ని బట్టి చెప్పాలంటే.. డార్క్ కామెడీ, వింతైన ఎంటర్‌టైనర్గా సినిమా ఉండనుందని అర్ధమవుతోంది.
అయితే, ఈ సినిమా ప్రస్తుతం కోర్ట్ కేసులో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రావడం సినిమా రిలీజ్ అయ్యేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా పాత ఆర్థిక లావా దేవీల వివాదంపై ఫైనాన్షియర్ అర్జున్ లాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు+వడ్డీ కలుపుకుని సుమారు రూ.21.78 కోట్లు బకాయిలు ఇవ్వాలని ఆరోపిస్తున్నారు.
విచారించిన మద్రాస్ హైకోర్టు.. అన్నగారు వస్తారు రిలీజ్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 8న ఫైనల్ విచారణ చేపట్టనుంది కోర్ట్. ఈ లోపు నిర్మాత జ్ఞానవేల్ రాజా అమౌంట్ సెట్ చేస్తే.. విడుదలకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఏమవుతుంది చూడాలి.
యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
