
ఈ ఏడాది ఆగస్టులో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత.. అఫ్గాన్ ను ప్రధాన స్థావరంగా మార్చుకున్న ఇస్లామిక్ సేట్(ICS) ఉగ్రవాద సంస్థ వరుస దాడులకు పాల్పడుతోంది.ఈసారి ఏకంగా సైనిక ఆస్పత్రిని టార్గెట్ చేసుకున్నారు.అఫ్గాన్ లోనే అతిపెద్ద మిలటీ ఆస్పత్రి అయిన సర్దార్ మొహమ్మద్ దావూద్ ఖాన్ ఆస్పత్రి దగ్గర మంగళవారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. జంట పేలుళ్లలో 19 మందికిపైగా చనిపోగా .. 50 మందికిపైగా గాయపడ్డారు. అంతేకాదు.. పేలుడు తర్వాత పారిపోతున్న జనంపై కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న సైన్యం .. ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. అప్గాన్ లో తాలిబన్ పాలన మొదలైన తర్వాత జరిగిన రెండో అతిపెద్ద పేలుడు.