తక్కువ రేటుకు ఇప్పిస్తామని నమ్మించి మోసం

తక్కువ రేటుకు ఇప్పిస్తామని నమ్మించి మోసం

ముగ్గురిని అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు

జీడిమెట్ల/హైదరాబాద్, వెలుగు: క్రిప్టో  కరెన్సీని తక్కువ రేటుకు ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి డబ్బులు కొట్టేసిన గ్యాంగ్​కు చెందిన ముగ్గురిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ కు చెందిన కన్నం రవితేజ అలియాస్​నితీశ్​కుమార్, సతీశ్​పాండే, సబ్బిశెట్టి ఫణి కుమార్​, పెండ్లపల్లి సతీష్​, పొడుగు సునీల్​ఐదుగురు గ్యాంగ్ గా ఏర్పడి ఆన్ లైన్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారిని మోసం చేస్తున్నారు.

కొంపల్లికి ఓ వ్యక్తిని ఇలాగే ట్రాప్ చేసిన ఈ గ్యాంగ్ థర్డ్ పార్టీ యాప్స్​ ప్రమేయం లేకుండా ఆన్ లైన్ ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్ కంటే తక్కువకే క్రిప్టో కరెన్సీని ఇప్పిస్తామని నమ్మించారు. అతడి దగ్గరి నుంచి రూ.19 లక్షలు వసూలు చేశారు. క్రిఫ్టో కరెన్సీ తన వాలెట్​లోకి యాడ్ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పేట్ బషీరాబాద్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవితేజ, సతీశ్ పాండే, ఫణికుమార్​ను శుక్రవారం అరెస్ట్​చేసి రిమాండ్​కి తరలించారు.   పెంట్లపల్లి సతీశ్,  సునీల్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

చైనా గేమింగ్ లో క్రిప్టో కరెన్సీ

చైనా ఆన్‌‌లైన్‌‌ గేమింగ్‌‌ బెట్టింగ్‌‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. క్రిప్టో కరెన్సీతో చైనాకు మనీ ల్యాండరింగ్‌‌ చేసిన ప్రముఖ వజీర్ ఎక్స్‌‌ జాన్మయి ల్యాబ్స్ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు చెందిన రూ.64.67 కోట్లు ఫ్రీజ్‌‌ చేసింది. ఫ్రీజింగ్ ఆర్డర్స్‌‌ వివరాలతో శుక్రవారం ప్రెస్‌‌నోట్‌‌ రిలీజ్ చేసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..లోన్‌‌ యాప్స్‌‌ మనీల్యాండరింగ్‌‌ కేసులో వజీర్‌‌‌‌ ఎక్స్‌‌ ఎక్స్‌‌చేంజ్ నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు క్యాష్  డైవర్ట్‌‌ అయ్యింది. ఆర్బీఐ గైడ్‌‌లైన్స్‌‌కి విరుద్ధంగా వజీర్‌‌‌‌ ఎక్స్‌‌కు చెందిన జాన్మయి ల్యాబ్స్‌‌ యూఎస్‌‌ఏ,సింగపూర్‌‌‌‌ కంపెనీల నుంచి వెబ్ అగ్రిమెంట్స్ చేసుకుంది. 2020 జులై నుంచి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ జరిపింది. చైనా గేమింగ్ యాప్స్‌‌ బిజినెస్‌‌లో ఇండియన్ కరెన్సీని క్రిప్టో కరెన్సీగా మార్చి కేమన్ దీవుల్లో రిజిస్టర్ అయిన 'బైనాన్స్ వాలెట్స్‌‌’ ద్వారా ల్యాండరింగ్ చేసింది. ఈ క్రిప్టో డైవర్షన్‌‌పై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ముంబయి కేంద్రంగా నిర్వహిస్తున్న వజీర్ఎక్స్ సంబంధిత సంస్థలపై బుధ, గురువారాల్లో దాడులు జరిపింది. హైదరాబాద్‌‌లోని 3 ప్రాంతాలతో పాటు దేశ వ్యాప్తంగా సోదాలు చేసింది. సుమారు రూ.2,790 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్‌‌ జరిగినట్లు గుర్తించింది.