Deepika Padukone: డిగ్రీ అయిపోయిందా? జాబ్ వద్దు అనుకుంటే.. దీపికా ఇచ్చిన ఛాన్స్ మిస్ అవ్వకండి!

Deepika Padukone: డిగ్రీ అయిపోయిందా? జాబ్ వద్దు అనుకుంటే.. దీపికా ఇచ్చిన ఛాన్స్ మిస్ అవ్వకండి!

సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) అదిరిపోయే అవకాశం అందించింది. తన 40వ పుట్టినరోజు (5 జనవరి) సందర్భంగా ఆమె ‘ది ఆన్‌సెట్ ప్రోగ్రామ్’ (The Onset Program) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

చదువు పూర్తయ్యాక ఖాళీగా ఉన్నవారు, లేదా సినిమాల్లో తమ ప్రతిభను చూపించాలనుకునే యువత కోసం ఈ ప్రోగ్రామ్ రూపొందించారు. మనలో చాలామందికి కథలు రాయడం, కెమెరా పని, దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్ డిజైన్ లాంటి రంగాల్లో టాలెంట్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టాలో తెలియదు. అలాంటి వారికోసమే దీపికా ఈ వేదికను తీసుకొచ్చారు.

ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువ టాలెంట్‌ను గుర్తించి, సినీ పరిశ్రమలోని ప్రముఖ టెక్నీషియన్లతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తారు. సినిమా రంగంలో రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, మేకప్, కాస్ట్యూమ్ డిజైన్, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన మార్గనిర్దేశం లేక అవకాశాలు కోల్పోతున్న యువతను గుర్తించి, వారికి పరిశ్రమలోకి ప్రవేశించేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు దీపికా వెల్లడించారు.

ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు onsetprogram.in వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత వివరాలతో పాటు, తమ నైపుణ్యానికి సంబంధించిన వర్క్ శాంపిల్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సినీ పరిశ్రమలో కెరీర్ నిర్మాణానికి ఇది ఒక అరుదైన అవకాశంగా నిలవనుంది.

ALSO READ : టాలీవుడ్ హీరోతో డేటింగ్.. 

దీపికా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'AA22xA6'. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తుంది. అల్లు అర్జున్ సినిమానే కాకుండా ఆమె ఖాతాలో మరికొన్ని భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్‌తో కలిసి కింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ వంటి భారీ తారాగణం కూడా కీలక పాత్రలో నటిస్తోంది.  40 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్, అదే ఎనర్జీతో దూసుకుపోతున్న దీపికా పదుకొణెకు ఈ ఏడాది కెరీర్ పరంగా చాలా కీలకం.