Meenakshi Chaudhary: టాలీవుడ్ హీరోతో డేటింగ్.. పెళ్లి రూమర్స్‌పై మీనాక్షి చౌదరి క్లారిటీ !

Meenakshi Chaudhary: టాలీవుడ్ హీరోతో డేటింగ్.. పెళ్లి రూమర్స్‌పై మీనాక్షి చౌదరి క్లారిటీ !

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న బ్యూటీ మీనాక్షి చౌదరి. వరుస హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా పేరును సొంతం చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు' . ఈ మూవీ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న మీనాక్షి .. తన వ్యక్తగత జీవితం, కెరీర్ పై వస్తున్న  పలు రూమర్స్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

పెళ్లి రూమర్లపై మీనాక్షి అసహనం

గత కొన్నాళ్లుగా ఒక టాలీవుడ్ యువ హీరోతో మీనాక్షి చౌదరి  ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై మీనాక్షి స్పందిస్తూ.. ప్రతిరోజూ నా పెళ్లి గురించి వస్తున్న అసత్య వార్తలు చూసి నిజంగా విసిగిపోయాను. ఈ రూమర్స్ నా శక్తిని హరిస్తున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉంది. పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడప్పుడే లేదు అని  స్పష్టం చేసింది. తన టీమ్ ఈ వార్తలను ఖండించినా, తన నోటితోనే క్లారిటీ ఇవ్వాలని భావించి ఇప్పుడు చెబుతున్నట్లు తెలిపింది.

Also Read : ‘ది రాజా సాబ్’ సెన్సార్ క్లియర్.. హారర్ కామెడీలో రికార్డ్ నిడివి! ప్రభాస్ రాజాసాబ్ కథ ఇదేనా?

పాత్రల ఎంపికపై క్లారిటీ

‘లక్కీ భాస్కర్’ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి మెప్పించిన మీనాక్షి.. ఇకపై అలాంటి పాత్రలు చేయనని అన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..  నేను అలాంటి మాటలు ఎప్పుడూ అనలేదు. నేను కథలకు, పాత్రలకు పెద్ద అభిమానిని. కథలో బలం ఉండి, నా పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఏ రోల్ అయినా చేయడానికి నేను సిద్ధం. నటిగా ఏ ఒక్క ఇమేజ్‌కో పరిమితం అవ్వాలని నేను కోరుకోవడం లేదు అని  ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేశారు.

సంక్రాంతి సెంటిమెంట్.. హ్యాట్రిక్ దిశగా!

మీనాక్షి చౌదరికి సంక్రాంతి సీజన్ బాగా కలిసివస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 2024లో  ‘గుంటూరు కారం’తో నటించి సక్సెస్ ను అందుకుంది మీనాక్షి చౌదరి. . ఆ తర్వాత 2025లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించి  భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు  నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో నాగచైతన్యతో చేస్తున్న ‘వృషకర్మ’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే.. కేవలం పనిపైనే శ్రద్ధ పెడతానని, గాసిప్పులను పట్టించుకోనని ఆమె తన స్టైల్‌లో సమాధానమిచ్చారు.