హిమాచల్ ప్రదేశ్లో కుండపోత.. 19 మంది గల్లంతు

హిమాచల్ ప్రదేశ్లో  కుండపోత.. 19 మంది గల్లంతు

 హిమాచల్ ప్రదేశ్ లోని  సిమ్లా జిల్లా రాంపూర్ లో భారీ వర్షాలు పడుతున్నాయి.  సమేజ్ ఖాడ్ ప్రాంతంలో వరదలకు   19 మంది గల్లంతయ్యారు.  ఆగస్టు 1న ఉదయం  ఈ ఘటన జరిగినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనురాగ్ కశ్యప్  తెలిపారు.    ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. రెస్క్యూ టీంలో ఐటీబీపీ, స్పెషల్ హోంగార్డులు కూడా సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అంబులెన్స్ సహా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా బియాస్ నది కూడా ఉదృతంగా ప్రవహిస్తోంది.

 రాష్ట్రంలో భారీ వర్షాలపై   కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆరాతీశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎ సుఖ్ విందర్ సుఖుతో మాట్లాడారు.  రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. 
 కేరళలో  ఇప్పటికే  భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 190కిపైగా మృతి చెందారు. వంద మందికి పైగా చిక్కుకున్నారు. ఇంకా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.