- పీసీసీ చీఫ్‌ను కోరిన1969 ఉద్యమకారులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన 1969 ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల సమితి నేతలు కోరారు. ఆదివారం పీసీసీ చీఫ్‌ను ఆయన నివాసంలో సమితి సెక్రటరీ జనరల్ సుదర్శన్ రావు ఆధ్వర్యంలో ఉద్యమకారులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సుదర్శన్ రావు మాట్లాడారు. మున్సిపల్ కోడ్ రాకముందే కమిటీని ప్రకటించాలని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించినందుకు పీసీసీ చీఫ్‌ను ఉద్యమకారులు అభినందించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నెలకు రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.1969 ఉద్యమకారులు 2,500 మంది ఉండగా అనారోగ్యాలతో మరణిస్తున్నారని చెప్పారు. దావోస్ నుంచి సీఎం రాగానే ఉద్యమకారులను ఆయన దగ్గరకు తీసుకెళ్తానని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారని సుదర్శన్ రావు వెల్లడించారు.
