ప్లాస్టిక్ ఇవ్వండి.. బియ్యం తీసుకెళ్లండి

ప్లాస్టిక్ ఇవ్వండి.. బియ్యం తీసుకెళ్లండి

 లెనిన్ నగర్ జీపీ నిర్ణయం

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్ నగర్​పంచాయతీ కొత్త నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ పల్లెగా మార్చడం కోసం కిలో ప్లాస్టిక్ ఇస్తే.. కిలో బియ్యం ఇవ్వనున్నట్లు పంచాయతీ సర్పంచి సనాది సబిత ప్రకటించారు. ఉప సర్పంచ్​దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ ​ఎవ్వరి ఇంట్లో ఉన్నా.. గ్రామ పంచాయతీకి అప్పగిస్తే.. తూకం వేసి అందుకు సమానమైన బియ్యం ఇస్తామని తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యవర్గం గాంధీకి  నివాళి అర్పించారు.