టరౌబా (పోర్ట్ ఆఫ్ స్పెయిన్): బ్రియన్ లారా స్టేడియం వేదికగా తొలి టీ20లో వెస్టిండీస్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. వన్డే సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్, పంత్, హార్దిక్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ రాకతో జట్టు మరింత పటిష్టంగా తయారైంది. వరల్డ్ కప్ నకు మూడు నెలల సమయం కూడా లేకపోగా, భారత్ గరిష్టంగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులోనే తమ వరల్డ్‌కప్ సైన్యాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్ జట్టులో బెర్త్ ఆశించే ఆటగాళ్లకు కీలకం కానుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్!
వెస్టిండీస్: షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్(కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్
West Indies have won the toss and elected to field in the first T20I ?
— ICC (@ICC) July 29, 2022
? @windiescricket
Watch #WIvIND for FREE on https://t.co/CPDKNxpgZ3 (in select regions) ? pic.twitter.com/an70Ic07kJ
? Here's #TeamIndia's Playing XI ?
— BCCI (@BCCI) July 29, 2022
Follow the match ▶️ https://t.co/qWZ7LSCVXA #WIvIND pic.twitter.com/F5lu3EZy3N
