మార్చిలో 2, 15,450 మంది  రామయ్యను దర్శించుకున్నరు

మార్చిలో 2, 15,450 మంది  రామయ్యను దర్శించుకున్నరు

భద్రాచలం, వెలుగు :  మార్చి నెలలో భద్రాచలం  సీతారామచంద్రస్వామిని 2, 15, 450 మంది భక్తులు దర్శించుకున్నారు.  మార్చి 25న అత్యధికంగా 14, 304 మంది, 5న  అత్యల్పంగా 3958 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో ఎల్​.రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో వివరించారు.

రామయ్యకు సోమవారం ముత్తంగి సేవ  నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.