మన జెండా ఎదుట.. పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు.. ఇద్దరు అరెస్ట్

మన జెండా ఎదుట.. పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు.. ఇద్దరు అరెస్ట్

77వ  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పలువురు యువకులు నినాదాలు చేసిన ఘటన పూణెలో చోటుచేసుకుంది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరెస్టైన ఇద్దరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  

లక్ష్మీనగర్‌లో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనం నుంచి పాకిస్థాన్ జిందాబాద్ అనే ప్రకటన వినిపించింది. పలువురు యువకులు పాకిస్థాన్ జెండాను ఎగురవేసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు వచ్చేసరికీ పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి. నేరుగా వారిపై దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిని అక్బర్ నదాఫ్, తౌఖిర్‌లుగా గుర్తించారు. తౌఖీర్ పాఠశాల భవనంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తు్ండగా,  అక్బర్ నదాఫ్ కోండ్వాలోని బేకరీలో పనిచేస్తున్నాడు.

పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిందితుల మొబైల్‌ ఫోన్ల నుంచి పోలీసులకు భారత్‌ వ్యతిరేక పోస్టులతో పాటు పలు సమాచారం లభించింది. అదేవిధంగా పుణెలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.