హైటెక్ సిటీ మైండ్ స్పేస్ లో రెండు బిల్డింగ్స్ కూల్చివేత.. క్షణాల్లో నేల మట్టం

హైటెక్ సిటీ మైండ్ స్పేస్ లో రెండు బిల్డింగ్స్ కూల్చివేత.. క్షణాల్లో నేల మట్టం

హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఐటీ పార్కు అయిన మైండ్ స్పేస్ లో రెండు భవనాలను కూల్చివేశారు అధికారులు. 2023, సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం ఈ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ఒక్కో బిల్డింగ్ ఆరు అంతస్తుల్లో ఉన్నాయి. ఈ రెండు బిల్డింగ్స్ విషయంలో యజమానుల సమస్యలతోపాటు.. సాంకేతికమైన ఇష్యూస్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు భవంతులను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.

మైండ్ స్పేస్ లోని ఈ రెండు భవనాలు.. వాకింగ్ ట్రాక్ పక్కనే ఉంటాయి. మైండ్ స్పేస్ మధ్యలో ఉంటాయి. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ భవనాల కూల్చివేత బాధ్యతను నిపుణులకు అప్పగించారు. మందు గుండు సామాగ్రితో.. రెండు భవనాలను క్షణాల్లో కూల్చివేశారు అధికారులు. భవనాల కూల్చివేతను ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ పర్యవేక్షించింది. 10 సెకన్లలోనే మైండ్ స్పేస్ లోని రెండు బిల్డింగ్స్ నేలమట్టం అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.