
యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు అధికారులు. సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన వలస కూలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. అదే విధంగా చౌటుప్పల్ మున్పిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన మరో వలస కూలీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు మండల వైద్యాధికారి శివప్రసాద్ రెడ్డి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 18(వలస కూలీలు)కి చేరిందని తెలిపారు అధికారులు.