13 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్లుగా....

13 ఏళ్లకే  ఐపీఎస్ ఆఫీసర్లుగా....

మామూలుగా పోలీస్ ఆఫీసర్ కావాలంటే... రాత పరీక్ష, ఫిట్ నెస్ పరీక్షల్లాంటి టెస్టులు పాసయితేనే జాబ్ వస్తుంది. అది కూడా 18ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే అర్హులు. అయితే తాజాగా 13 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు పోలీస్ ఆఫీసరులయ్యారు. అదెలా కుదిరింది. అసలేమైంది అనే విషయానికొస్తే... కేరళకు చెందిన మహ్మద్ సల్మాన్, బెంగళూరుకు చెందిన మిథిలేష్‌లు పోలీసు యూనిఫాం ధరించి, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  అయితే 13ఏళ్లకే ఎలా పోలీస్ కావడం ఎలా సాధ్యమైంది... అని ఆరా తీస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ ఆఫీసర్లుగా కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో సతమవుతున్న వారి... IPS అధికారులు కావాలనే కోరికను మేక్ ఏ విష్ అనే ఎన్జీవో నెరవేర్చింది. దీనికి బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ పోలీసులు కూడా అంగీకరించడంతో ఆ చిన్నారుల డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యింది. బెంగళూరులోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలురు.. పోలీసు యూనిఫాంలో అక్కడి కార్యాలయంలోకి వెళ్లి..  కొద్దిసేపు కూర్చున్నారు. అనంతరం అధికారులు వారిపై బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వారి బాధ్యతల్లో భాగంగా పోలీసు స్టేషన్‌ను కూడా సందర్శించారు.