ఇద్దరూ DRDO సైంటిస్టులు.. ఒకరికి పెళ్లై ఆరునెలలు..హానీ కు ప్లాన్ చేసుకుంటున్నారు.. మరొకరు మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరూ 30లోపు వారే.. ఎలాంటి అనారోగ్య కారణాలు లేవు. కానీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వారంరోజుల వ్యవధిలో ఒకే రకంగా ఇద్దరు శాస్త్రవేత్తలు చనిపోవడం చర్చనీయాంశమైంది.
ఇద్దరు DRDO శాస్త్రవేత్తల ఆకస్మిక మరణాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇద్దరూ యువకులు..ఆరోగ్యంగా ఉన్నారు..ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు..అకస్మాత్తుగా మృతిచెందడంపై డాక్టర్లకే అంతు చిక్కడం లేదు.. గుండెపోటుతో మరణించి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినా.. ఆ లక్షణాలు చాలా తక్కువే అంటున్నారు డాక్టర్లు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులు వస్తేగానీ ఏం తేల్చలేమని చెబుతున్నారు. DRDO లో కీలక మిషన్లతో పనిచేస్తున్న ఈ ఇద్దరు సైంటిస్టుల మృతి ఇప్పుడు అంతుచిక్కని రహస్యం.
గుండెపోటేనా..? లేదా ఇంకేదైనా?
లక్నోకు చెందిన 30 యేళ్ల ఆకాష్ దీప్ గుప్తా..DRDO లో బ్రహ్మోస్ క్షిపణి మిషన్‌పై పనిచేస్తున్నారు. పెళ్లై ఆరునెలలే.. ఢిల్లీలో ఉంటున్న పేరెంట్స్ చూసేందుకు వచ్చి నవంబర్ 21న ఉన్నట్టుండి ఇంట్లోనే అనారోగ్యం పాలయ్యాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాడు.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
మరోసైంటిస్ట్ ఢిల్లీ అల్వార్ కు చెందిన ఆదిత్య వర్మ.. నవంబర్ 27న అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు. పెళ్లైన రెండు రోజులే.. కొత్త జంట హానీమూన్ ప్లాన్ చేసుకున్నారు. టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆదిత్య కుటుంబం తెలిపింది. మరో రెండు రోజుల్లో హానీమూన్ వెళ్లనున్న ఆదిత్యవర్మ ఆకస్మాత్తుగా విగతజీవిగా మారాడు.
ఇద్దరి మరణాలు దాదాపు ఒకేరకంగా సంభవించాయి. కుటుంబ సభ్యులు గుండెపోటు తో మరణించి ఉండొచ్చు అని చెబుతున్నా.. డాక్టర్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే సరియైన కారణాలు చెప్పగలం అని చెబుతున్నారు.
DRDO భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోధన ,అభివృద్ధి సంస్థ. దీనిని 1958లో స్థాపించారు. డీఆర్డీవో ప్రధాన లక్ష్యం ఆధునిక రక్షణ సాంకేతికతలతో దేశ వ్యవస్థలను బలోపేతం చేయడం. ఇలాంటి కీలక సంస్థకు చెందిన శాస్త్రవేత్తల వరుస మరణాలపై పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గుండెపోటు అని అనుకుంటున్నా.. ఇప్పుడే నిర్ధారించలేం.. రిపోర్టు వస్తే చెప్పొచ్చు అని తేల్చి చెప్పారు.
