ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీలు మృతి

ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీలు మృతి

ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా లోని బద్రీనాథ్ హైవేపై శనివారం (జూలై 6) ఈ ప్రమాదం జరిగింది.  మృతులు హైదరాబాద్ కు చెందిన షాహి(36)సత్యనారాయణ (50) లుగా గుర్తించారు. కొద్దిరోజులుగా కురుస్తు్న్న భారీ వర్షాలకు బద్రీనాథ్, రుద్రప్రయాగ్,కేదారినాథ్ హైవైపై పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో రాళ్లు, మట్టి కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీరిద్దరు బైక్ పై బద్రీనాథ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొండ మీద నుంచి ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లోని పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రదీనాథ్ జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లపై పడ్డాయి. ఈ ప్రాంతాల్లో నేషనల్ హైవే అథారిటీ , బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్ సిబ్బంది రోడ్లను క్లియర్ చేసే చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడటంతో రుద్ర ప్రయాగ్ -కేదారినాథ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.