ఇండో అమెరికన్లకు అత్యున్నత అవార్డులు

ఇండో అమెరికన్లకు అత్యున్నత అవార్డులు

వాషింగ్టన్: టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసిన ఇద్దరు ఇండో అమెరికన్లకు యూఎస్ అత్యుత్తమ పురస్కారాలు దక్కాయి. అశోక్ గాడ్గిల్ కు ‘నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’, సుబ్రా సురేశ్​కు ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ అవార్డులు వరించాయి. అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్​ను వైట్​హౌస్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పురస్కారాలతో సత్కరించారు.

 డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ, శక్తివంతమైన స్టౌవ్​లు, సమర్థవంతమైన ఎలక్ట్రిక్ లైట్లను అశోక్ గాడ్గిల్ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలకు దారి చూపారు. దీని కోసం అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ప్రజలకు జీవనాధార వనరులు అందించినందుకు అమెరికన్ గవర్నమెంట్ అశోక్ గాడ్గిల్​ను ‘నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డుతో సత్కరించింది.

 గాడ్గిల్ చేసిన ఆవిష్కరణలు 10 కోట్లకు పైగా ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక, సైన్స్ రంగంలో సేవలు అందించినందుకు గాను సుబ్రా సురేశ్​కు ఆ కేటగిరిలో అమెరికా అత్యున్నత పురస్కారంతో సన్మానించింది. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ రంగాల్లో సురేశ్ సరికొత్త ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా మెటీరియల్ సైన్స్ అధ్యయనానికి గాను ఈ గుర్తింపు దక్కింది. అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ ఇద్దరూ ముంబైకి చెందినవాళ్లే కావడం విశేషం.