హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో నాలుగు కమిషనరేట్లు ఏర్పడడంతో ఆయా కమిషనరేట్లలో జాయింట్ సీపీలు, డీసీపీలను నియమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ, వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఇటీవల కమిషనరేట్ల పునర్విభజనలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించింది. సిటీ కమిషనరేట్ పరిధిలోని సౌత్ రేంజ్‌కు అడిషనల్ కమిషనర్ ఎల్‌అండ్‌ఓగా తఫ్సీర్ ఇక్బాల్‌ను నియమించారు. ఎన్ శ్వేత ఐపీఎస్‌ను నార్త్ జోన్ రేంజ్ (జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్) హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా నియమించారు.
అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
1. తఫ్సీర్ ఇక్బాల్ జాయింట్ సీపీ (ఎల్ అండ్ ఓ) హైదరాబాద్ అదనపు సీపీ (ఎల్ అండ్ ఓ) సౌత్ రేంజ్ హైదరాబాద్
2. ఎన్. శ్వేత డీసీపీ, డీడీ, హైదరాబాద్ జాయింట్ సీపీ (ఎల్అండ్ఓ) నార్త్ రేంజ్, హైదరాబాద్
3. విజయ్ కుమార్ సిద్దిపేట సీపీ జాయింట్ సీపీ, స్పెషల్ బ్రాంచ్, హైదరాబాద్
4. ఎన్. కోటి రెడ్డి డీసీపీ, మేడ్చల్ జోన్ డీసీపీ కుత్బుల్లాపూర్ జోన్ (సైబరాబాద్)
5. కె. నారాయణ రెడ్డి డీసీపీ, మహేశ్వరం జోన్ డీసీపీ, మహేశ్వరం జోన్ (ఫ్యూచర్ సిటీ)
6. రక్షిత కె. మూర్తి డీసీపీ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ, సికింద్రాబాద్ జోన్ (హైదరాబాద్ సిటీ)
7. కె. సురేష్ కుమార్ డీసీపీ, బాలానగర్ డీసీపీ, ఉప్పల్ జోన్ (మల్కాజిగిరి)
8. ఖారే కిరణ్ ప్రభాకర్ డీసీపీ, సౌత్ జోన్, హైదరాబాద్ డీసీపీ, చార్మినార్ జోన్ (హైదరాబాద్ సిటీ)
9. డాక్టర్ బి. అనురాధ డీసీపీ, ఎల్.బి. నగర్ జోన్ డీసీపీ, ఎల్.బి.నగర్ జోన్ (మల్కాజిగిరి)
10. యోగేష్ గౌతమ్ డీసీపీ, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ, చేవెళ్ల జోన్ (ఫ్యూచర్ సిటీ)
11. రితిరాజ్ డీసీపీ, మాదాపూర్ డీసీపీ, కూకట్ పల్లి జోన్ (సైబరాబాద్)
12. సి.హెచ్. శ్రీనివాస్ డీసీపీ, వెస్ట్ జోన్, హైదరాబాద్ డీసీపీ, శేరిలింగంపల్లి జోన్ (సైబరాబాద్)
13. రష్మీ పెరుమాళ్ డీసీపీ, నార్త్ జోన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సిద్దిపేట
14. సీహెచ్ శ్రీధర్ డీసీపీ, మల్కాజిగిరి, రాచకొండ డీసీపీ, మల్కాజిగిరి జోన్ (మల్కాజిగిరి)
15. కె. శిల్పవల్లి డీసీపీ, సెంట్రల్ జోన్, హైదరాబాద్ డీసీపీ, ఖైరతాబాద్ జోన్ (హైదరాబాద్ సిటీ)
16. ఎస్. శ్రీనివాస్ ఎస్పీ, టీజీ ట్రాన్స్ కో డీసీపీ, రాజేంద్రనగర్ జోన్ (హైదరాబాద్ సిటీ)
17. జి. చంద్ర మోహన్ (నాన్ కేడర్) డీసీపీ, సౌత్ వెస్ట్ జోన్, హైదరాబాద్ డీసీపీ, గోల్కొండ జోన్ (హైదరాబాద్ సిటీ)
18. ఎ. రమణా రెడ్డి (నాన్ కేడర్) డీసీపీ, ఎస్ఓటీ, రాచకొండ డీసీపీ, జూబ్లీహిల్స్ జోన్ (హైదరాబాద్ సిటీ)
19. బి. రాజేష్ (నాన్ కేడర్) డీసీపీ, శంషాబాద్ డీసీపీ, శంషాబాద్ జోన్ (హైదరాబాద్ సిటీ)
20. సి.హెచ్.శిరీష (నాన్ కేడర్) ఎస్పీ, ఇంటెలిజెన్స్ డీసీపీ, షాద్ నగర్ జోన్ (ఫ్యూచర్ సిటీ)
