కరోనా దెబ్బకు 20 లక్షల మంది వర్క్‌ ఫ్రం హోమ్‌

కరోనా దెబ్బకు 20 లక్షల మంది వర్క్‌ ఫ్రం హోమ్‌

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ ఐటీ యూనిట్లలో పనిచేసే 18–20 లక్షల మంది ఉద్యోగులు వారి ఇండ్ల నుంచే పనిచేయాలని (వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌ ) ప్రభుత్వసంస్థ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌టీపీఐ) సూచించింది. వీరంతా ఇది వరకే వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌ కోసం రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారని తెలిపింది. ఈ విషయంలో కంపెనీలకు వెసులుబాటు కల్పించాలని, ఓఎస్‌‌‌‌‌‌‌‌పీ (అదర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ రిజైమ్‌ ) కంపెనీల ఉద్యోగులకు వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌ సదుపాయం కల్పించాలని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎస్‌‌‌‌‌‌‌‌టీపీఐలో 20 లక్షల మంది ఉద్యోగులు, మూడు వేల సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాయి. వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌ కోసం ఉద్యోగులకు లాప్‌ టాప్‌ లేదా డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్‌ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని సూచించింది. ఇది వరకే చాలా కంపెనీలు వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలిప్రెజెన్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌ విధానాల ద్వారా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నాయి. అయితే వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్‌ హోమ్‌‌ను అమలు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా టెక్నికల్‌ సమస్యలు ఎక్కువ ఉన్నాయని కంపెనీలు చెబుతున్నాయి.

For More News..

ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

మహేశ్ కాదన్న సినిమా.. పవన్ చేస్తున్నాడా?