20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

న్యూఢిల్లీ: మే 15 నుంచి జూన్ 15 మధ్య మన దేశంలో 20 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ చెప్పింది. గురువారం రిలీజ్ చేసిన మంత్లీ కంప్లయన్స్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ కు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నా మంది. ఇలాంటి అకౌంట్లను మూడు స్టేజ్ లలో గుర్తిస్తామని.. రిజిస్ట్రేషన్ టైమ్ లో, మెసేజ్ లు చేసేటప్పుడు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ కు స్పందించేటప్పుడు వాటిని తెలుసుకుంటామంది. యూజర్ రిపోర్ట్స్, బ్లాక్స్ ద్వారా ఈ సమాచారం తమకు వస్తుందని చెప్పింది. ‘‘వాట్సాప్ లో హింసాత్మక మెసేజ్ లను నివారించ డానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా ఘటన జరిగిన తర్వాత దానికి కారణాలను గుర్తించడం కంటే, అది జరగకుండా ఆపడమే ఉత్తమమైన పని అని మేం భావిస్తున్నాం’’ అని వాట్సాప్ పేర్కొంది.