20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు

20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు

గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. చాలా హెల్దీగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ 20 ఏళ్లఇంజనీరింగ్‌ విద్యార్థి గుండె ఆగింది. గుండెలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ఆ యువకుడిని తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోని కన్నుమూశాడు. 

ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం,గుమ్మడవెల్లి (దేవరోని తండా)కు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లమా EEE మూడవ సంవత్సరం చదువుతున్నాడు. 

అయితే శనివారం మధ్యాహ్నం ఉదయం 1:30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఉండగా సిద్దు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు,హాస్టల్ సిబ్బంది సిద్దును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సిద్దు కన్నుమూశాడు. తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. సిద్దుకి ఎలాంటి చేడు అలవాట్లూ లేవని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపారు.