నాగార్జునసాగర్ ప్రభుత్వ దవాఖానలో వికటించిన ఇంజెక్షన్‌.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

నాగార్జునసాగర్ ప్రభుత్వ దవాఖానలో వికటించిన ఇంజెక్షన్‌.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు 17 మందిని ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, నాగార్జునసాగర్ ప్రభుత్వ దవాఖానలోని పిల్లల విభాగంలో 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 14) రాత్రి పిల్లలకు ఇంజెక్షన్‌ ఇవ్వగా అది వికటించింది. 

ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత చిన్నారులు విపరీతమైన చలి జ్వరం, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన డాక్టర్లు చిన్నారులను ఐసీయూకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు ఆరా తీశారు. ఇంజెక్షన్ వికటించడానికి కారణమేంటనే దానిపై వైద్యులు ఎంక్వైరీ చేస్తున్నారు.