- సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రమాదం
మునగాల, వెలుగు : ముందు వెళ్తున్న డీసీఎంను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో హైవే 65పై గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని తమ్మరకు చెందిన షేక్ సిరాజ్ (53), అతడి బంధువు షేక్ సైదా (40) కలిసి బైక్‌పై మునగాల నుంచి కోదాడ వైపు వెళ్తున్నారు.
ఆకుపాముల వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో సిరాజ్ అక్కడికక్కడే చనిపోగా.. సైదాకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సైదాను ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం ఉదయం సైదా చనిపోయాడు.
