మేడిపల్లి, వెలుగు: హైదరాబాద్ పరిసరాల్లో మంచినీటి కొరతపై జాగృతి పోరాటం చేస్తున్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో కేవైసీస్ రాష్ట్ర అధ్యక్షుడు, పూలే ఫ్రంట్ కో-కన్వీనర్ గొరిగే నరసింహ కురుమ సహా 200 మంది తెలంగాణ జాగృతిలో చేరారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నరసింహ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందన్నారు. నరసింహ మాట్లాడుతూ.. కవిత బీసీ పోరాటాలు చూసి జాగృతిలో చేరామన్నారు.
