రైలు ఢీకొని 200 గొర్రెలు మృతి

రైలు ఢీకొని 200 గొర్రెలు మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. నవీపేట మండలం ఫక్రాబాద్‌లో రైలు ఢీకొని 200 గొర్రెలు చనిపోయాయి. పకీరాబాద్ దగ్గర అర్థరాత్రి కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్టు గొర్రెల యజమాని చెప్తున్నాడు. నవీపేటలో నిన్నంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో మేతకు వెళ్లిన గొర్రెల మంద తప్పిపోయింది. అటూ.. ఇటూ.. తిరుగుతూ రైల్వేలైన్‌పై రాళ్ల మధ్య కూర్చున్నట్లు తెలుస్తోంది. అయితే అదే ట్రాక్‌పై అర్థరాత్రి వచ్చిన కృష్ణా ఎక్స్‌ప్రెస్.. ఢీకొనడంతో రైల్వే లైన్‌పై ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి. ఒకేసారి గొర్రెలన్నీ చనిపోవడంతో యజమాని కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని కోరుతున్నాడు.