రాయితీ రద్దుతో రైల్వేకు 2 వేల కోట్ల ఆదాయం 

రాయితీ రద్దుతో రైల్వేకు 2 వేల కోట్ల ఆదాయం 

న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ ప్యాసింజర్ల రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించింది.కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి సీనియర్ సిటిజన్ ప్యాసింజర్స్​కు రైల్వే రాయితీని నిలిపివేసిన విషయం తెలిసిందే.  2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య దాదాపు 8 కోట్ల మంది వృద్ధులకు రాయితీ ఇవ్వలేదు. ఈ టైంలో సీనియర్ సిటిజన్స్​ నుంచి మొత్తం రూ.5,062 కోట్ల ఆదాయం రాగా.. అందులో రాయితీ నిలిపివేయడం ద్వారా రూ.2,242 కోట్లు అదనంగా వచ్చింది. ఆర్టీఐ ప్రశ్నకు జవాబిస్తూ రైల్వే ఈ వివరాలను వెల్లడించింది.