300 మీటర్ల జాతీయ జెండాతో 2వేల మంది విద్యార్థుల ర్యాలీ

300 మీటర్ల జాతీయ జెండాతో 2వేల మంది విద్యార్థుల ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పట్టణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  300 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో టుటౌన్ పోలీసు స్టేషన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మొత్తం 2 వేల మంది విద్యార్థులతో పాటు టీచర్లు, పోలీసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.