
ముంబై: 2006 బాంబు పేలుళ్ల కేసులో 12 మందిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ఆ పేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు చిరాగ్ చౌహాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యాయాన్ని చంపేశారని మండిపడ్డాడు. ఈ తీర్పు వెలువడిన గంట తర్వాత ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టాడు. ఈ రోజు దేశ చట్టాలు విఫలమయ్యాయని రాసుకొచ్చాడు. ఈ రోజు చాలా విచారకరమైన రోజు అని, వేలాది కుటుంబాలు అనుభవించిన బాధ, కోలుకోలేని నష్టానికి న్యాయం జరగలేదని పేర్కొన్నాడు. పేలుళ్ల సమయంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటే తమకు న్యాయం జరిగేదని అన్నాడు.