
ఒకప్పుడు మొహం మీద వెంట్రుక లేకుండా (మీసాలు తప్ప) క్లీన్ షేవ్ చేయించుకునేటోళ్లు. నీట్‌గా, ఓ పద్ధతిగా ఉంటారన్నది వాళ్ల నమ్మకం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెద్ద పెద్ద గడ్డాలుండాల్సిందే. రకరకాల స్టైల్స్‌లో గడ్డాలు పెంచేస్తూ తెగ హొయలు పోతుంటారు నేటి కుర్రకారు. సినిమాల దగ్గర్నుంచి క్రీడల వరకూ, పాప్స్టార్స్ నుంచి మామూలు యూత్ వరకూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు గడ్డాలే ట్రెండింగ్ మరి. బెల్జియంలో ఇప్పుడు ఆ గడ్డాలపైనే ప్రపంచ చాంపియన్‌షిప్ జరుగుతోంది. యాంట్వెర్ప్లో 2019 వరల్డ్ బెర్డ్అండ్ ముస్టాష్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. ఆ పోటీలకు వందలాది మంది రకరకాల స్టైల్స్‌లో గడ్డాన్ని తీర్చిదిద్దుకుని వస్తున్నారు. ఎవరికివాళ్లు తమదే ఆ చాంపియన్‌షిప్ అన్న ధీమాతో ఉన్నారు. గడ్డాలను అట్ల చేసుకొచ్చుకున్నరు మరి. ఆ చాంపియన్‌షిప్‌లో ఉప కేటగిరీలూ ఉన్నాయి. మీసాలు, చిన్న గడ్డం, పెద్ద గడ్డం వంటి విభాగాలున్నాయి. ఆడోళ్లూ ఈ చాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు అవకాశం కల్పించారు. అరె, వాళ్లకు గడ్డాలుండవు కదా, ఎట్ల అంటారా? కృత్రిమ గడ్డాలతో వాళ్ల క్రియేటివిటీని చూపెట్టుకోవాలి మరి. ఆ గడ్డం ఎట్లుండాలంటే సరిగ్గా వాళ్ల మొహాలకు అతికినట్టు ఉండాలి. 2001 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలను రెండేళ్లకోసారి పెడతారు. వేర్వేరు దేశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తుంటారు.