2023-24 స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ఎన్ని రోజులు స్కూళ్లు..ఎన్ని రోజులు సెలవులు

2023-24 స్కూల్ అకాడమిక్ క్యాలెండర్  ఎన్ని రోజులు స్కూళ్లు..ఎన్ని రోజులు సెలవులు

2023-24 స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ క్యాలెండర్ ను  విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ విడుదల చేశారు. జూన్ 12వ తేదీన అన్ని పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. 2023-24 అకాడమీ ఇయర్ లో  మొత్తం 229 రోజుల పాటు స్కూల్స్ నడవనున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ లో 2023-24 ఏప్రిల్ 23వ తేదీ స్కూల్స్ లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించారు. 

స్కూల్ టైమింగ్స్ ఏంటీ..

రాష్ట్రంలోని హై స్కూల్ విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4: 45 వరకు స్కూల్ ఉంటుంది.  సికింద్రాబాద్, హైదరాబాద్ లోని స్కూళ్లు  ఉదయం 8:45 నుండి సాయంత్రం4 గంటల వరకు నడుస్తాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్స్  ఉదయం 9 నుండి సాయంత్రం 4: 15 వరకు క్లాసులు నిర్వహిస్తాయి. జంట నగరాల్లో  ఉదయం 8:45 నుండి సాయంత్రం 4గంటల వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ విద్యాబుద్దులు నేర్పిస్తాయి.  విద్యార్థులకు 45 నిమిషాలు విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఉంటుంది.  ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాలు యోగా,  మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. 2024 జనవరి 10 వరకు అన్ని తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఏడాది పండగ సెలవులు ఇవే.. 

2023 అక్టోబర్ 13 నుండి 25 వరకు...మొత్తం 13 రోజుల పాటు స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. డిసెంబర్ 22 నుండి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే 2024 జనవరి 12నుండి 17 వరకు ఆరు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. 2024 మార్చి లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు.