తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ : నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ : నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్

2023 తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. 2023, అక్టోబర్ 9వ తేదీ ఈ మేరకు ప్రకటన చేసింది. నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ కౌంటింగ్ ఉండనుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే దశలో.. సింగిల్ ఫేజ్ లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.

నోటిఫికేషన్ తేదీ : నవంబర్ 3వ తేదీ
నామినేషన్ల చివరి తేదీ : నవంబర్ 10వ తేదీ
నామినేషన్ల పరిశీలన చివరి తేదీ : నవంబర్ 13వ తేదీ
అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ : నవంబర్ 15వ తేదీ
పోలింగ్ తేదీ : నవంబర్ 30వ తేదీ
ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3వ తేదీ, 2023