హోండా కార్స్ ఇండియా సిటీ మోడల్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.12 లక్షలు కాగా, టాప్-ఎండ్ హైబ్రిడ్ వేరియంట్ ఈ:హెచ్‌ఈవీ ధర రూ.21 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఈ కారులో ఎల్‌ఈడీ లైటింగ్, కొత్త గ్రిల్, 16-ఇంచ్ అలాయ్ వీల్స్, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్డ్ ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 17.77–-17.97 కిమీ మైలేజ్‌ను, 1.5లీటర్ల స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ 27.26 కిమీ మైలేజ్ ఇస్తుంది. 3 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో పాటు హైబ్రిడ్ బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ ఉంది. డెలివరీలు ప్రారంభమయ్యాయి.
