లక్ష మందితో మార్చ్ 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహావీర్ జయంతి

లక్ష మందితో మార్చ్  31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  మహావీర్ జయంతి

బషీర్​బాగ్, వెలుగు: జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో భగవాన్ మహావీర్ 2,625వ జన్మ కల్యాణక్ మహోత్సవం (మహావీర్ జయంతి) అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను శనివారం బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఫీల్​ఖానా జైన మందిరం నుంచి భారీ శోభాయాత్ర ప్రారంభమై, 10:30 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్​కు చేరుకుంటుందని సంఘ్ చైర్మన్ యోగేశ్ కుమార్ సింగి తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకల్లో లక్షకు పైగా జైన సమాజం పాల్గొంటుందని, ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.