
మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ అభ్యర్థి కూడా నామినేషన్ ను విత్ డ్రా చేసుకోకపోవడంతో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16వ తేదీన కౌంటింగ్ఉం టుందని అధికారులు వెల్లడించారు.