సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి : అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి : అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
  • జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

మల్కాజిగిరి, వెలుగు: ప్రజల సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే స్పందించాలని, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మల్కాజిగిరి జోనల్ పరిధిలో ఆయన పర్యటించారు. ఏఓసీ నుంచి ఆర్‌‌కే పురం వరకు ప్రధాన రహదారులు, ఆర్‌‌యూబీ, ఆర్‌‌ఓబీలను పరిశీలించారు. రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్  పాల్గొన్నారు.