భారీ మిసైల్తో..కీవ్‌‌పై రష్యా దాడి

భారీ మిసైల్తో..కీవ్‌‌పై రష్యా దాడి

కీవ్‌‌: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున భారీ మిసైల్స్, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తం నలుగురు ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉక్రెయిన్‌‌పై దాడికి అత్యాధునిక హైపర్‌‌సోనిక్ ఒరెష్నిక్ బాలిస్టిక్ మిసైల్‌‌ (ధ్వని కంటే 10 రెట్లు వేగం ఎక్కువ, సెకనుకు సుమారు 3 కిలోమీటర్లు)ను ఉపయోగించినట్లు రష్యా వెల్లడించింది. ఇది ఏ డిఫెన్స్ సిస్టమ్‌‌కూ అందని మిసైల్ అని తెలిపింది.

గత నెల చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినందుకు ప్రతీకారంగా ఈ అటాక్ చేశామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ వైమానిక దళం స్పందిస్తూ.. కీవ్‌‌పై రష్యా మొత్తం 242 డ్రోన్లు, 36 క్షిపణులతో దాడి చేసిందని తెలిపింది.