ఇజ్రాయల్ లో కొత్త వైరస్ : ఆ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి..!

ఇజ్రాయల్ లో కొత్త వైరస్ : ఆ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి..!

కరోనా మహమ్మారి సృష్టించిన మారణకాండ ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో ప్రపంచంలో ఏదో ఒక మూల రోజుకో కొత్త వైరస్ పేరు వినిపిస్తూ జనాలను హడలెత్తిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ లో వ్యాపిస్తున్న కొత్త వైరస్ టెన్షన్ పెడుతోంది. ఇజ్రాయెల్ లో వెస్ట్ నైల్ వైరస్ అనే కొత్త వైరస్ వ్యాపిస్తోందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటిదాకా 21మంది ఈ వైరస్ బారిన పడగా వీరిలో 17మంది న్యూరోలాజికల్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని,ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మరణించినట్లు తెలిపింది.

వెస్ట్ నైల్ ఫీవర్ అంటే ఏంటి:

క్యూలెక్స్ జీనస్ ( culex genus ) అనే జాతికి చెందిన దోమకాటు వల్ల ఈ వైరస్ సోకుతుంది.మేలో ఇండియాలో ఈ వైరస్ ఫస్ట్ కేస్ నమోదైనట్లు తెలుస్తోంది.

వెస్ట్ నైల్ వైరస్ లక్షణాలు:

  • కడుపు నొప్పి
  • జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి
  • ఆకలి లేకపోవడం
  • కండరాల నొప్పి
  • వికారం, వాంతులు, విరేచనాలు
  • శరీరంలో వాపులు.

ఈ వైరస్ సోకిన కొంతమందిలో పై లక్షణాలు 3నుండి 6రోజుల వరకు ఉండగా ఇంకొంత మందిలో నెలకు పైగా ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. 60ఏళ్ళ వయసు పైబడ్డవారిలో, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో, క్యాన్సర్, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ నుండి రిస్క్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అవయవ మార్పిడి చేసుకున్నవారు కూడా ఈ వైరస్ నుండి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.